Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోర్ టు డోర్ కార్యక్రమం.

ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోర్ టు డోర్ కార్యక్రమం.

by CVR NEWS

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎం.వి. నగర్‌లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత కేంద్రం సహిత విద్య నూతన భవనాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: