83
తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. లోక్‌సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి విజన్, అభివృద్ధి పురోగతిని ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. అమరావతి భవిష్యత్ ప్రాధాన్యతపై కూడా ఎంపీలు వివరించారు. ఎంపీలతో కేంద్ర మంత్రి సుహృద్భావంగా చర్చించారు. అమరావతి అభివృద్ధి అంశాలను ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. ఎంపీల చొరవను కూడా ఆయన అభినందించారు. సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.