Thursday, August 13, 2026
News Navigation
Thursday, August 13, 2026
News Navigation

Breaking

Thursday, August 13, 2026
Home International ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠ.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠ.

by CVR NEWS

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఇరాన్‌ తిప్పి కొట్టింది. సుప్రీం లీడర్‌ వీడియోను ప్రభుత్వ మీడియా సంస్థ విడుదల చేసింది . అందులో మొజ్తబా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. ఎటువంటి గాయాలు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కానీ కనిపించలేదు. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీశారనే విషయాన్ని మాత్రం ఇరాన్‌ వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా కనిపించకపోవడంతో అసలు ఆయన బతికే ఉన్నారా..?అనే ప్రశ్న వినిపిస్తోంది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ గుర్తుపట్టలేని రీతిలో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇక ఆయన 90శాతం చనిపోయినట్లేననన్నారు. ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లోనూ మొజ్తబా కనిపించలేదు. అంతకు ముందు జరిగిన ఆయన సతీమణి అంత్యక్రియల్లోనూ సుప్రీం లీడర్‌ కనిపించకపోవడం గమనార్హం. అయితే, భద్రతా కారణాల వల్ల ఆయన హాజరుకావడం లేదని ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే మొజ్తబా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, మరికొన్ని రోజుల్లో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనక్కరలేదని ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ క్రమంలోనే ఇరాన్‌ మొజ్తబా వీడియో విడుదల చేసింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: