Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Crime హయత్‌నగర్ శంకర్‌నగర్‌లో కారులో మంటలు.

హయత్‌నగర్ శంకర్‌నగర్‌లో కారులో మంటలు.

by CVR NEWS

హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారులో మంటలు కలకలం రేపాయి.. శంకర్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ కారు మాధవరెడ్డికి చెందినదిగా తెలుస్తోంది. అయితే కారును ఎవరైనా ఆకతాయిలు కావాలనే తగలబెట్టి ఉంటారనే అనుమానాన్ని కారు యజమాని వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు ఎలా దగ్ధమైందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌నగర్‌లోని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు వద్దకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చారా.. కావాలనే నిప్పు పెట్టారా అనే విషయాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: