Thursday, August 13, 2026
News Navigation
Thursday, August 13, 2026
News Navigation

Breaking

Thursday, August 13, 2026
Home Latest News ఈ నెల18 నుంచి కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే.

ఈ నెల18 నుంచి కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే.

by CVR NEWS

హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి పార్కు చుట్టూ వన్‌వే విధానం అమలు కాబోతుంది.
అండర్‌పాస్‌ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. కీలక కూడళ్లలో సైన్‌బోర్డులు, లేన్‌ మార్కింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు 24×7 ట్రాఫిక్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. వాహనదారులు కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

కేబీఆర్‌ పార్కు చుట్టూ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ నిర్వహణలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి పార్కు చుట్టూ వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ప్రాంతాల్లో లేన్‌ మార్కింగ్‌లు, లేన్‌ ఛేంజర్‌లను ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.
వన్‌వే అమలులో భాగంగా కీలక కూడళ్ల వద్ద ప్రత్యేక ట్రాఫిక్‌ సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటలూ ట్రాఫిక్‌ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. కొత్త రూట్‌ విధానంపై వాహనదారులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కొత్త ట్రాఫిక్‌ విధానానికి అనుగుణంగా గూగుల్‌ మ్యాప్స్‌, ఇతర నావిగేషన్‌ రూట్లలోనూ అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, సీసీటీవీ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్‌ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు డ్రోన్లతో రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ కూడా చేపట్టనున్నారు.
వన్‌వే అమలు ప్రారంభమైన తర్వాత క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌ పరిస్థితులను అధికారులు సమీక్షించనున్నారు. రద్దీకి అనుగుణంగా అవసరమైన మార్పులు, సర్దుబాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ప్రయాణించే వాహనదారులు కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని గమనించి, తమ గమ్యస్థానానికి చేరుకునే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని సీపీ సజ్జనర్‌ సూచించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: