ఓటు హక్కు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో తాను కూడా ఒకడినంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇది జోక్ కాదా అంటూ ప్రశ్నించిన ప్రకాష్ రాజ్.. తాను బెంగళూరులోనే పుట్టి, పెరిగి, చదువుకున్నానని గుర్తుచేశారు.తన థియేటర్, కళా ప్రయాణం అంతా బెంగళూరుతోనే ముడిపడి ఉందని తెలిపారు. అంతేకాకుండా ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తన ఓటు హక్కును తిరిగి పొందేందుకు ఎలాంటి ప్రక్రియను పూర్తి చేయాలి? ఏయే పత్రాలు సమర్పించాలి? అన్నది తెలుసుకుంటానని పేర్కొన్నారు.‘గేమ్ ఆన్’ అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఓటర్ల హక్కుల విషయంలో అధికారుల తీరును ప్రశ్నిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమను ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి అధికారాన్ని ఉపయోగించవచ్చని విమర్శించిన ఆయన.. కానీ అధికారంలో ఉన్న వారిని గద్దె దించేందుకు ప్రజలకు ఉన్న ఓటు హక్కును, వారి ప్రయత్నాన్ని అడ్డుకోగలరా అంటూ ప్రశ్నించారు.
ఓటు హక్కు అంశంపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.
29
previous post