25
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. సుమారు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో ముందుకు సాగారు. జాతీయ రహదారితో పాటు కోరుట్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది.వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ విద్యార్థులు, నాయకులు చేసిన దేశభక్తి నినాదాలతో కోరుట్ల పట్టణం మార్మోగింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో తిరంగా ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.