Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News కేటీఆర్ విమర్శలకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్.

కేటీఆర్ విమర్శలకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్.

by CVR NEWS

కేసిఆర్ తన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరూ బాగుపడవద్దని భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తన కుటుంబం రాజకీయాల్లోకి రాదని చెప్పిన కేసీఆర్.. 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో తన కుటుంబంలోనే ఐదు పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి నేరుగా మంత్రి అయ్యారని, హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యారని గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఐదుగురు సోదరులకు ఎలాంటి పదవులు ఇచ్చుకోలేదని, అందరిలాగే దరఖాస్తు చేసుకుంటేనే ఆయన సోదరునికి భూమి కేటాయించారని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతోనే బీఆర్‌ఎస్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఆ పార్టీకి దీనిపై మాట్లాడే అర్హతే లేదన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన దోస్తుల కంపెనీలకు ఏ విధంగా భూములు కట్టబెట్టారో తమకు అన్నీ తెలుసని, కుటుంబంలో పంపకాలు తేడా రావడం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ తన పిచ్చి మాటలు బంద్ చేయాలని ఎంపీ చామల కిరణ్ రెడ్డి హితవు పలికారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: