Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home TelanganaKarimnagar పెట్రోల్ బంక్ సమీపంలో ఎగిసి పడిన మంటలు

పెట్రోల్ బంక్ సమీపంలో ఎగిసి పడిన మంటలు

by Rama
Oil tanker

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వెంటనే ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్ బయటకు దూకి తప్పించుకున్నాడు. అక్కడే పలువురు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023978
Total views : 143664

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.