Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home International మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామ

మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామ

by Rama
మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామ

అందాల పోటీల్లో మిస్ యూనివర్స్ గా డెన్మార్క్ భామ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నది. తొలి రన్నరప్‌గా నైజీరియా భామ చిడిమ్మ అడెట్షినా నిలిచింది. ఇక సెకండ్ రన్నరప్‌గా మెక్సికో యువతి ఫెర్నాండా కిరీటం దక్కించుకున్నది. ఇక భారత్ నుంచి ఈ పోటీల్లో అహ్మదాబాద్ మోడల్ రిహా సింగా పాల్గొన్నారు. అయితే ఈ బ్యూటీ టాప్-30 వరకు చేరుకోగలిగింది. కానీ తర్వాతి రౌండ్‌లో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌ చేజారిపోయింది. ఇక మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ యువతి విక్టోరియాకు గత ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన అమెరికన్ మోడల్ షెన్నిస్‌ పలాసియోస్‌ కిరీటాన్ని అందించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014747
Total views : 80982

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.