216
హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుమ్మలూరు గేట్ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన నాలుగు కార్లు ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా షిఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో జాతీయ రహదారిపై రెండు గంటలపాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.