Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్..!

వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్..!

by Satya
Amanchi Krishna Mohan

ఉమ్మడి ప్రకాశం జిల్లా(Prakasam District)లో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) వైసీపీ(YCP)కి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ చీరాల టికెట్ ను వైసీపీ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ కు కేటాయించింది. అటు, ఆయన గతంలో ఇన్చార్జిగా వ్యవహరించిన పర్చూరు నియోజకవర్గంలోనూ చుక్కెదురైంది. పర్చూరు వైసీపీ టికెట్ ను యెడం బాలాజీకి ఇచ్చారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురైన ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులతో చర్చించి వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9న ప్రజల సమక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు. కాగా, ఆమంచి కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: ఏసీబీ వలలో టంగుటూరు ఎస్సై…


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
Advertisements

You may also like

Our Visitor

023248
Total views : 141654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.