అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే ప్రమాదంలో పడ్డాయని, న్యాయపోరాటం ద్వారా వాటిని కాపాడుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సుమారు నూరు మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ రుణాలు మంజూరు చేసి, త్వరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థల పత్రాలు, నిర్మాణ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
Andhra Pradesh
పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా నుంచి తెలంగాణకు టాటా మాంజా కారులో తరలిస్తున్న 116 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5 లక్షల 60 వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పైలట్‌గా వ్యవహరించిన హోండా యూనికార్న్ ద్విచక్ర వాహనంతో పాటు టాటా మాంజా కారును పోలీసులు సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. కృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను మరింత బలోపేతం చేయడంతో పాటు, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు 1,299 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కార్యాలయ సముదాయం ద్వారా …అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేసే అవకాశం కలుగనుంది. పరిపాలనా సామర్థ్యం పెరగడమే కాకుండా, శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతోంది.
ఇదే సమయంలో కేంద్ర ఉద్యోగుల కోసం సుమారు 1,235 కోట్ల రూపాయల వ్యయంతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో 1,504 నివాస గృహాలు, ఆధునిక సదుపాయాలతో కూడిన నివాస సముదాయం నిర్మించనున్నారు. కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణంతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ఈ ప్రాజెక్టులు గణనీయమైన ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పరిపాలనా మౌలిక సదుపాయాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి.. ఈ ఆమోదం నిదర్శనమని ఆయన అభినందించారు. మొత్తం మీద ₹2,534 కోట్ల విలువైన ఈ రెండు ప్రాజెక్టులు అమరావతి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచనున్నాయనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది..
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలల సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి. నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చుతామని వైసీపీ హయాంలో పనులు ప్రారంభించినా సకా లంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రా క్టర్లు చేతులె త్తేశారు. ఇలాంటి స్కూళ్లు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని స్కూళ్లలో బాత్రూములు అసంపూర్తిగా ఉంటే మరికొన్ని స్కూల్ బిల్డింగులు స్లాబ్ వరకు వచ్చి నిలిచిపోయాయి. కొన్ని స్కూళ్లకు ఫెన్సింగ్ వాల్ లేదు. పాఠశాలల్లో గదులు సరిపోక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నర్సాపురం మండలం సీతారాంపురం జడ్పీ హైస్కూల్,SNS హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్ తూర్పుతాడళ్ళు జడ్పీ హైస్కూల్, మల్లవరం స్కూళ్ల భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వమైనా ఈ అసంపూర్తి భవనాలు పూర్తి చేసి విద్యార్థుల కష్టాలు కడతేర్చాల్సిన అవసరం ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద వంతెన విరిగి ప్రమాదకరంగా మారింది. బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు. సుమారు వంద సంవత్సరాలు కావస్తున్నా కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ బ్రిడ్జి కింద 300 ఎకరాల ఆయకట్టుకు వెళ్లే రైతులకు ఇదే మార్గం, కోలాలపల్లి గ్రామానికి వెళ్లాలన్నా అప్రోచ్ మార్గం ఇదే. ఏ క్షణాన్నైనా వంతెన కూలిపోయే ప్రమాదం ఉన్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ వంతెన పై నుంచి అధికలోడుతో మట్టిటిప్పర్లు, లారీలు యథేచ్ఛగా వెళుతున్నాయి.. వంతెన పొడవునా గ్రిల్ లేకపోవడంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయనీ.. అధికారులు కనీస మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలిపోతే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెన పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల ఇరవై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష జరిపారు. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కిసాన్ సెజ్‌లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇంటి స్థలం, పక్కా ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండ్రోజుల క్రితం ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు.. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని మంత్రి ఆదేశించారు. అటువైపు వెళ్లిన మంత్రి.. వ్యర్థాలు తొలగించకపోవడాన్ని గమనించి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఘటనాస్థలికి పిలిపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని.. టెండర్ పిలిచి తొలగిస్తామని మున్సిపల్ సిబ్బంది సమాధానం చెప్పారు. మున్సిపాలిటీ జేసీబీ, ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండరా? అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవుపెట్టి వెళ్లండని హెచ్చరించారు. వ్యర్థాలు తొలగించే వరకు ఇక్కడే ఉంటానని కాల్వగట్టుపై ఉన్న బల్లపై కూర్చున్నారు. దీంతో హడావుడిగా అక్కడికి చేరుకున్న మున్సిపల్ యంత్రాంగం.. చెత్త తొలగింపు పనులు చేపట్టింది.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్,పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ సమావేశమై జిల్లా రాజకీయాలపై కీలకమైన చర్చలు జరిపారు.ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చిన సహచర మంత్రులకు ఆనం సాదర స్వాగతం పలికారు.జిల్లావ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా సాగిన ఈ భేటీలో ముగ్గురు మంత్రులు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్‌ను ఎలా బలోపేతం చేయాలి, పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఒక పక్కా వ్యూహాన్ని,మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు.ముగ్గురు కీలక మంత్రులు ఒకే చోట చేరి పార్టీ పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వ్యూహ రచన చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను మరింత బలోపేతం చేయడంతో పాటు, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు 1,299 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కార్యాలయ సముదాయం ద్వారా …అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేసే అవకాశం కలుగనుంది. పరిపాలనా సామర్థ్యం పెరగడమే కాకుండా, శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతోంది.
ఇదే సమయంలో కేంద్ర ఉద్యోగుల కోసం సుమారు 1,235 కోట్ల రూపాయల వ్యయంతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో 1,504 నివాస గృహాలు, ఆధునిక సదుపాయాలతో కూడిన నివాస సముదాయం నిర్మించనున్నారు. కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణంతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ఈ ప్రాజెక్టులు గణనీయమైన ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పరిపాలనా మౌలిక సదుపాయాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి.. ఈ ఆమోదం నిదర్శనమని ఆయన అభినందించారు. మొత్తం మీద ₹2,534 కోట్ల విలువైన ఈ రెండు ప్రాజెక్టులు అమరావతి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచనున్నాయనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది..
ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో పొందేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో RTGS సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు..ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలనూ ఆన్లైన్ చేశామని తెలిపారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా ఆన్లైన్ యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే తరహా సేవలు అందించాలన్నారు. ప్రజలకు తాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లను ప్రతిరోజూ పరీక్షించాలని స్పష్టం చేశారు. రక్షిత నీటి సరఫరాలో అశ్రద్ధ ఉండొద్దని..మంచినీటి సరఫరా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను విజయవంతం చేయగలమని చెప్పారు. ప్రకృతి, పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలని, చెరువులన్నీ నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, ప్రతి కుంట, ప్రతి చెరువులోని నీటి నిల్వను ఆన్లైన్లో సమీక్షించాలని నిర్దేశించారు. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ పరిశీలనా విధానాన్ని అమలు చేయాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టాలని, గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని స్పష్టం చేశారు.




Total views : 203117