246
మెగా డీఎస్సీ నియామకాల అంశంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో నిర్వహించిన దీక్షలో పార్టీ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ హాజరై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, మైక్ అనుమతుల అంశంలో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.