Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh లేపాక్షి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..

లేపాక్షి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..

by CVR NEWS
లేపాక్షి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

అమరావతిలో లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల మూల వేతనంపై 10 శాతానికి పైగా పెంపు చేస్తూ మంత్రి సవిత నిర్ణయం తీసుకున్నారు.లేపాక్షి షోరూమ్‌ల్లో అమ్మకాలు గణనీయంగా పెరగడం, ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి అమ్మకాలు రూ.60 కోట్ల 75 లక్షలకు పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఏడాదిలో అమ్మకాలను రూ.80 కోట్లకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు.జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి సవితకు లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: