Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

by CVR NEWS
నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సోన్ గ్రామ శివారులో చెలరేగిన మంటలు వందల ఎకరాల పొలాలను బూడిద చేశాయి. వరి కొయ్యలతో పాటు వందలాది మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 ఎకరాల పొలాల్లో ఉన్న వరి కొయ్యలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొద్దిరోజుల కిందటే రైతులు వరి పంట కోసి ధాన్యాన్ని తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పొలాల్లో ఏర్పాటు చేసిన సుమారు 600 మోటార్లు, కేబుల్ వైర్లు, పైపులు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018645
Total views : 89068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.