పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రతీ నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల ‘జలధార–జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది. నిడదవోలులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరుతారు. 11.00 గంటలకు నిడదవోలు చేరుకుంటారు. 11.20 గంటలకు సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.50 గంటలకు మలకోడు సరస్సును సందర్శించి స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 02.30 గంటలకు ఎస్టీ అంబ్రోస్ స్కూలు సమీపంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు అమరావతికి చేరుకుంటారు.
నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు..
122





Total views : 142006