Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Telangana తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ

తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ

by Rama
తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ

తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 వేల 372 మంది దీని బారిన పడ్డారు. జూన్‌ నెలాఖరు వరకు ఒకవేయి78 మందికి నిర్ధారణవగా, గత రెండు నెలలుగా 4వేల 294 నమోదయ్యాయి. డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు డెంగ్యూకేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. చికున్‌ గున్యా ఉందన్న అనుమానంతో 2 వేల 673 నమూనాలను పరీక్షించగా 152 కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో విజృంభిస్తున్నడెంగ్యూ. దీనికి సంబంధించి 5శాతం పాజిటివిటీ ఉంటోంది. ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బయటపడుతున్నాయి. డెంగ్యూకి కారణమయ్యే టైగర్‌ దోమ మంచి నీటిలో పెరిగి.. ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023435
Total views : 142006

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.