Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

by Rama
chandra babu

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: