Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home National నేడు SBI పిటిషన్‌పై విచారణ

నేడు SBI పిటిషన్‌పై విచారణ

by Satya
Hearing on SBI petition today

SBI పిటిషన్.. నేడు ఎన్నికల బాండ్ల కేసులో విచారణ:

ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds) వివరాలను ఈసీ(EC)కి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) దాఖలు చేసిన పిటిషన్‌(Petition)పై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్(Chief Justice Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టనుంది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించేందుకు తుది గడువును జూన్ 30 వరకూ పొడిగించాలని కోరుతూ SBI సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ బద్ధం కాదంటూ సుప్రీం కోర్టు గత నెలలో తీర్పు వెలువరించింది. బాండ్ల జారీని తక్షణం నిలిపివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతే కాకుండా, బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు అందిన సొమ్ము, దాతల వివరాలను ఈ నెల 13లోగా ఈసీ ముందుంచాలని ఆదేశించింది. అయితే, ఈసీకి ఈ సమాచారం సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని SBI పిటిషన్ దాఖలు చేసింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నోవాటెల్ హోటల్ కి చంద్రబాబు.


షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ …
దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా …
నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.
ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్‌లో ప్రధాని పర్యటన సాగనుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

041212
Total views : 214650

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: