Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home International ఆర్మీలో చేరితే అప్పులన్నీ తీర్చేస్తాం…

ఆర్మీలో చేరితే అప్పులన్నీ తీర్చేస్తాం…

by CVR NEWS
ఆర్మీలో చేరితే అప్పులన్నీ తీర్చేస్తాం

ఉక్రెయిన్‌ తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైన్యంలోకి కొత్త రిక్రూట్లను ఆకర్షించేందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఉక్రెయిన్ ఫ్రంట్‌ లైన్‌లో పోరాడటానికి సైన్యంలో చేరే కొత్త రిక్రూట్లు, ప్రైవేట్ కాంట్రాక్ట్ సైనికులకు సంబంధించిన అప్పులను పూర్తిగా రద్దు చేస్తూ రష్యా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యం బలాన్ని పెంచేందకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యంగ్‌స్టర్స్ యుద్ధంలోకి దించడానికి రష్యా క్రెమ్లిన్ ఈ వినూత్న ఆర్థిక ప్యాకేజీని అస్త్రంగా ఎంచుకుంది.

అయితే, సైన్యంతో కనీసం ఓ సంవత్సరం పాటు పోరాడటానికి ఒప్పందం కుదుర్చుకునే ఏ రష్యన్ పౌరుడైనా ఈ అప్పుల విముక్తికి అర్హుడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వ డీల్ ఒప్పుకుంటే పాత బ్యాంక్ లోన్లు, వినియోగదారుల రుణాలు సుమారు 10 మిలియన్ రూబుల్స్ అంటే భారత భారత కరెన్సీలో 1.33 లక్షల వరకు పూర్తిగా మాఫీ కానున్నాయి. కేవలం సదరు సైనికుడికే కాకుండా, అతని భార్య పేరిట ఉన్న రుణాలకు కూడా ఈ లోన్ వైవర్ వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: