Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh వైసీపీ కి మరో షాక్ తగలబోతుందా..!

వైసీపీ కి మరో షాక్ తగలబోతుందా..!

by Rama
Eliza

వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజాకు వైసీపీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. చింతలపూడి వైసీపీ ఇంఛార్జ్ గా మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ విజయరాజును నియమించింది. వైసీపీ బాస్ నిర్ణయంపై ఎలీజా మండిపడుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ చెప్పినట్లుగానే పనులు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు ప్రజల కోసం నిరంతరాయంగా పనిచేశానని తెలిపారు. నా పనితీరు ప్రజలకు నచ్చింది.. కానీ పెత్తందారులకు నచ్చలేదని మండిపడ్డారు. చింతలపూడిలో నాకు సీటు ఇస్తే.. పెత్తందారులకు మనుగడ ఉండదనే ఉద్దేశంతోనే నాకు సీటు రాకుండా చేశారని ఎలీజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల సలహాలు, సూచనలతో త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఎలీజా తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: