Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ చైర్మన్ గా మాచాని వెంకటేష్…

సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ చైర్మన్ గా మాచాని వెంకటేష్…

by Prakash
Machani Venkatesh as Chairman of SAPNET

సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఛైర్మెన్ (SAPNET) గా మాచాని వెంకటేష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో బీసీ కోటలో ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ టికెట్ ను ముందుగా మాచాని వెంకటేష్ కు కేటాయించి ఆ తరువాత సర్వేల్లో ఆయనకు వ్యతిరేకత రావడంతో ఆయన్ను తప్పించి బుట్టా రేణుకాకు ఆ భాద్యతలు అప్పగించారు. అయితే మాచాని వెంకటేష్ ను తప్పించే క్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా సోమవారం మాచాని వెంకటేష్ కు సొసైటీ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ నెట్వర్క్ ఛైర్మెన్ పదవి వరించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: