ఏపీలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేవలం రాజముద్రతో కూడిన కొత్త పాస్ బుక్ లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు చూపించారు. కొత్త పాస్ బుక్ పై క్యూఆర్ కోడ్ ను కూడా పొందుపరిచారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పట్టాదారు పేరిట ఉన్న ఆస్తుల వివరాలన్నీ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు, ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వివరాలతో కూడిన మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు.ఏపీలో త్వరలోనే రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు సీఎం చంద్రబాబు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రస్తావన రావడంతో పాస్ పుస్తకాలపై రాజముద్ర తప్పనిసరిగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదని స్పష్టం చేశారు. అధికారులు చూపించిన కొత్త పాస్ పుస్తకాన్ని పరిశీలించిన చంద్రబాబు… పలు సూచనలు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ…
- పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన…
- గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 80890