Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ లోని కమలానగర్ లో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ కేంద్రం పై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ లోని కమలానగర్ లో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ కేంద్రం పై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.

by CVR NEWS

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ లోని కమలానగర్ లో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ కేంద్రం పై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ప్రజలను కలవరపెట్టే విషయాలు వెలుగు చూశాయి.పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత ఆపరిశుభ్రమైన వాతావరణంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా లెక్కచేయకుండా తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.ఇంకా విచారణలో బయటపడిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే ..బిస్కెట్ల తయారీలో నాసిరకం, పాడైన గుడ్లు ఉపయోగిస్తున్నట్టు తేలిపోయింది. ఈ గుడ్లు వినియోగించడం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని తెలిసినా వినియోగించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఫ్యాక్టరీ యాజమానీ మేరజ్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. నగరంలో ఆహార భద్రత ప్రమాణాల గాలికొదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: