Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home International హైవేపై వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం..!

హైవేపై వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం..!

by Satya
The plane hit the car

అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన జరిగింది. నైరుతి ఫ్లోరిడా కొల్లియర్ కౌంటీలోని రద్దీగా ఉండే పైన్ రిడ్జ్ రోడ్‌పై ఫ్లోరిడాలోని ఓ హైవేపై అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం ప్రమాదవశాత్తూ అటుగా వెళ్తున్న కారుని ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పెద్దఎత్తున మంటలు చెలరేగిన కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడని, రెండు ఇంజన్లు ఫెయిల్ అవడంతో ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్‌తో మాట్లాడుతుండగానే కమ్యూనికేషన్ తెగిపోయిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. తమ కళ్ల ముందు జరిగిన ఈ ప్రమాదాన్ని నమ్మలేకపోతున్నామని, సినిమాల్లోని దృశ్యంలా కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

026009
Total views : 149692

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.