Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home TelanganaKhammam వెంటాడి వేధించి ప్రాణం తీసిన రికవరీ ఏజెంట్లు..

వెంటాడి వేధించి ప్రాణం తీసిన రికవరీ ఏజెంట్లు..

by Rama
Recovery Agent

ఖమ్మం (Khammam)లో రికవరీ ఏజెంట్ల దారుణం

ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. టూ వీలర్ కిస్తీ చెల్లించలేదని ఓ కస్టమర్ ను పరిగెత్తిస్తూ మీద రాళ్లేస్తూ వెంటపడడంతో భయంతో చెరువులో దూకాడు. అయినా వదలకుండా అలాగే రాళ్లేయడంతో బయటకు రాలేక.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..యూపీలోని ఆగ్రా సమీపంలో ఉన్న అయ్యేలా గ్రామానికి చెందిన వినీత్ బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి మార్బుల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

కొన్ని నెలల కింద వినీత్, ఇతడి మేస్త్రీ అజయ్ ఠాగూర్ కలిసి వైరా రోడ్డులోని టూ వీలర్ షోరూంలో కొంత డౌన్ పేమెంట్ కట్టి మోహనసాయి ఆటో ఫైనాన్స్లో రెండు టూ వీలర్లు తీసుకున్నారు

మొదట్లో కిస్తీలు సరిగ్గానే కట్టినా ఈ మధ్య పని లేక కట్టలేదు. వినీత్ వాహనంపై రూ.4 వేలు, ఠాగూర్ వెహికల్పై రూ.14 వేలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్ నాలుగు రోజుల కింద వినీత్ టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు

ఠాగూర్ కనిపించకపోవడంతో ఆయన వెహికల్కు పూచీకత్తుగా ఉన్నావని, అతడి డబ్బులు క్టటాలని ఒత్తిడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా అతడి వెంటపడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వదలడం లేదు.

పరిగెత్తించి..రాళ్లతో కొట్టిన రికవరీ ఏజెంట్లు

రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించని వినీత్ భయంభయంగానే తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బల్లేపల్లి వద్ద వినీత్ ఓ బండిపై వస్తూ రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్ కంట పడ్డాడు. దీంతో వారు వినీత్ను పట్టుకోబోగా తప్పించుకుని టూ వీలర్ పై కొంతదూరం పారిపోయాడు.

అయినా వదలకుండా వెంటాడడంతో వెహికల్ వదిలేసి పరిగెత్తాడు. అయినా చేతికి దొరికిన రాళ్లు విసురుతూ వెంబడించారు. భయంతో పరిగెత్తు తున్నా వెంటాడడం ఆపలేదు. చెరువు అడ్డం రావడంతో వినీత్ వేరే వైపు పరుగు తీశాడు.

అక్కడ కూడా రాళ్లేస్తుండడంతో భయపడి దిక్కుతోచక ఖానాపురం ట్యాంక్బండ్చెరువులో దూకాడు. చెరువులో దూకిన వినీత్ను కాపాడాల్సిన రికవరీ ఏజెంట్లు ఆ పని చేయకుండా మళ్లీ మీద బండలు విసిరారు. అప్పటికే పరిగెత్తి ఆయాసంతో ఉండడం, బయటకు రాకుండా రాళ్లేస్తుండడంతో ఊపిరాడక చనిపోయాడు

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223738

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: