Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home National సికింద్రాబాద్​-విశాఖ మధ్య రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్

సికింద్రాబాద్​-విశాఖ మధ్య రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్

by Satya
Narendra Modi inaugurated the Secunderabad-Visakha second Vande Bharat Express

సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన నరేంద్ర మోదీ:

సికింద్రాబాద్​-విశాఖపట్నం(Secunderabad – Visakhapatnam) మధ్య రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్(Vande Bharat Express)​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)వర్చువల్​గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​(Vande Bharat Express) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​(Telangana-Andhra Pradesh) రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందే భారత్​ రైలు నడవదు. మిగిలిన అన్ని రోజులు ప్రయాణిస్తుంది. ఈ రైలు సాధారణ సేవలు వైజాగ్​-సికింద్రాబాద్​(Vizag-Secunderabad) వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్​ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండో వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ టికెట్ల బుకింగ్స్​ మార్చి 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ వందే భారత్​ రైలు(Vande Bharat train) వరంగల్​, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ ఏడు ఏసీ ఛైర్​ కార్​ కోచ్​లు, ఒక ఎగ్బిగ్యూటివ్​ ఏసీ ఛైర్​ కార్​ కోచ్​లతో ప్రయాణిస్తుంది. అన్ని బోగీలలో కలిపి మొత్తం 530 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా…


భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా …
స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల …
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: