Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Film శివమల్లాల నిర్మాతగా నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం…

శివమల్లాల నిర్మాతగా నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం…

by Rama
Shivam Media

టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా (Shivam Media)’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ శివమల్లాల (Shiva Mallala) ఈ బ్యానర్‌ నిర్మాత. గురువారం ఈ సినిమా శివమ్‌ మీడియా లోగో మరియు బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్‌ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది’’ అన్నారు.

అనిల్‌ కడియాల మాట్లాడుతూ– శివమల్లాల తొలి రోజుల్నుంచి మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్‌ మీడియా’ అనే బ్యానర్‌ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– ‘‘ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్‌ మీడియా’ విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్‌ సినిమానా, స్ట్రెయిట్‌ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

శివమ్‌ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్‌ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాను’’ అన్నారు.

నటీననటులు– సాంకేతిక నిపుణులు
హీరో– హమరేశ్, హీరోయిన్‌ – ప్రార్థన సందీప్, ఆడుగాలం మురుగదాస్, మాటలు– కె.యన్‌ విజయ్‌ పాటలు– రాంబాబు గోసాల, సంగీతం– సుందరమూర్తి కె.యస్‌ డిఓపి– బ్యానర్‌– శివమ్‌ మీడియా నిర్మాత– శివమల్లాల, కథ– దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్‌ ,పీఆర్‌వో– మధు వి.ఆర్, మూర్తి మల్లాల

ఇది చదవండి:


చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, …
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026239
Total views : 150085

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.