Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్..

తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్..

by Rama
shanti kumari

తాగునీటి సమస్య (Drinking water Problem) తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ (Summer Action Plan) ను రూపొందించామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari) తెలిపారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని… ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయినట్లు వెల్లడించారు. నిర్వహణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతీరోజు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ఆపరేషన్, మెయింటెనెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇతర రాష్ట్రాలలోని తాగునీటి సమస్యను తెలంగాణకు కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన కథనాలు వస్తున్నాయని… కానీ రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్నా, ప్రధాన జలాశయాలు, ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌తో గత సంవత్సరం మాదిరిగానే నీటి మట్టాలు ఉన్నందున ఆందోళన అవసరం లేదన్నారు.

ఇది చదవండి: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పీఏ అరెస్ట్..


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

Follow us on: Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026049
Total views : 149791

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.