ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు. నాడు రాజధాని కోసం మహిళలు, రైతులు దీక్షలు చేశారని తెలిపారు. ఇలా దీక్షలు చేసిన మహిళలు, రైతులపై ఆనాడు దాడులు చేశారని మంత్రి లోకేశ్ గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు మూడు ముక్కలాట ఆడారని మంత్రి లోకేశ్ దుయ్యబట్టారు. ఇప్పటికీ రాజధాని విషయంలో జగన్ మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఆనాడు జగన్ కూడా అమరావతికి మద్దతు తెలిపారన్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మూడు రాజధానులు అంటూ మాట మార్చారని అన్నారు. అందుకే ప్రజలు మూడు రాజధానులను తిప్పి కొట్టారు.
Tag:





Total views : 140994