భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సీఎం స్థాయి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Tag:




Total views : 140733