Chandra babu bail
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో జగ్గంపేట సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో సంబరాలు జరుపుకున్న టిడిపి శ్రేణులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులన్నీ నిరాధారమైనవని నిరూపణ అయిందని నాయకుడు దేశానికి రాష్ట్రానికి కావలసిన నేత చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి కలిసి అక్రమ కేసుల్లో నిర్బంధించడం జరిగిందని ఈరోజు న్యాయం గెలిచి అధర్మం బంధింపబడిందని దానికి నిదర్శనం సాక్షాత్తు న్యాయమూర్తి ఈ కేసులపై ఆధారాలు లేవని అనడం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారని ఇదే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలల జైలు శిక్ష చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నప్పుడు న్యాయమూర్తి కేసులపై వ్యాఖ్యానించకపోవడం వ్యత్యాసాన్ని గమనించండి అని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తను ఒక ప్రభుత్వానికి సలహాదారుడుగా కాకుండా ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నాడని త్వరలోనే నీకు తగిన మూల్యం చెల్లిస్తామని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. మొన్న దీపావళి రోజున నరకాసుర వద్ద జరిగిందని కానీ ఈరోజు రాష్ట్రానికి పట్టిన జగన్ ఆసుర దహనం ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమైన దీపావళి చేసుకుంటారని అన్నారు.
కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన నాయకులు, ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ జనసేన నాయకులు డాన్స్ వేస్తూ ఈలలు కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ.. న్యాయస్థానం పై నమ్మకం ఉంది కాబట్టే న్యాయం గెలిచిందని, చెప్పిన విధంగానే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చాడని, టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రజలు చేసిన పూజలు ఫలించాయని, చంద్రబాబు కు బైయిల్ వచ్చింది. వైసీపీ పతనం ఆరంభమైంది అంటూ ఎద్దేవ చేశారు.
Read Also..
తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు. మతి స్దిమితం లేని వ్యక్తి, మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ.. పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు.. పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని..అందులో నిజం లేకుంటే వైసిపి సత్తా ఏంటో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు విడుదల సమయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ప్రతి వ్యాఖ్యలు చేశారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి వెళ్ళనున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ కి మాజీ మంత్రి దేవినేని ఉమా, గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో భారీగా మోహరించిన పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు.
బందరు రోడ్డు వైపు కాన్వాయ్ మళ్లించిన పోలీసులు తెల్లవారుజామున 4.45గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ కు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే మహిళల్లో పెల్లుబికిన ఆనందం, హారతులు పడుతూ నీరాజనాలు చేసారు . ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దే అనూరాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు స్వాగతం పలికారు. కారులోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ బాబు ముందుకు సాగారు.
Read Also..
విస్సన్నపేట బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 52 రోజుల తర్వాత రిమాండ్ నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవటంతో , తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు మిఠాయిలు, బాణాసంచా కాల్చారు కమ్మటూరు రామాలయం సెంటర్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు విడుదలైన సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు, పంచి సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాబా శ్రీను, మర్రిబోయిన చిన్నోడు, రాయల సుబ్బారావు, ఆకుల రాధా, రామినేని రామారావు, జనసేన పార్టీ నాయకులు, అడపా శ్రీను,కిషోర్, వెంకటేశ్వరరావు, యాసిన్, నాదెండ్ల నాగమణి, వాణి, కార్యకర్తలు వృద్ధులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమ్మటూరు మొత్తం పండుగ వాతావరణ నెలకొన్నది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు. జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు ఈ దుర్మార్గులు హాని కలిగించే వారని అన్నారు. కొన్ని గంటల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రానున్నారని చెప్పారు. తనపై కూడా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ 16 నుంచి 18 కేసులు పెట్టించాడని మండిపడ్డారు. తాను విడుదలైన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని… అయితే, ఆ దేవున్ని కూడా తనకు ఈ ముఖ్యమంత్రి దూరం చేశాడని అన్నారు. చంద్రబాబు విషయంలో న్యాయమూర్తి ద్వారా వెంకటేశ్వరస్వామి న్యాయాన్ని పలికించారని రఘురాజు చెప్పారు. వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శనం చేసుకుని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, నూతనోత్తేజంతో మళ్లీ ప్రజల మధ్య అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనను బాధ పెట్టిన అందరినీ రాజకీయంగా కడతేర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు. వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని… తాను తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేక అమెరికాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయాన్నీ తిరిగానని అన్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకన్న ఆలయాలన్నీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను ఏపీలోకి ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ముందే ఊహించే… లిక్కర్ కేసులో ఆయనపై మరో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ నాలుగు వారాల్లో చంద్రబాబును ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేరని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన ఐదు కేసులూ రెడ్లు పెట్టారని విమర్శించారు. కేసులు కట్టేది కూడా రెడ్డేనని, మధ్యలో కథ నడిపించేందరి సజ్జల రామకృష్ణారెడ్డి అని, పైనుంచి నడిపించేది జగన్ రెడ్డి అని అన్నారు. రెడ్లు తప్ప మరెవరూ లేరని… ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంకోచించనని చెప్పారు.




Total views : 61771