ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం పూట క్రికెట్ మ్యాచ్ చూడండి తప్పులేదు కానీ రైతుల గురించి కూడా పట్టించుకోండి అని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి అని అన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని అన్నారు. రైతులకు తక్షణమే రైతు రుణ మాఫీ, పంట నష్ట పరిహారం, వరి పంటకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళకళలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెల వెల బోతున్నాయని అన్నారు. రైతులు ఎవరు ఎవరు అధైర్య పడి ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
cm revanth reddy
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Kuna Srisailam Goud) కాంగ్రెస్ పార్టీ(Congress party)ల చేరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కూన పార్టీలో చేరారు. కూన శ్రీశైలం గౌడ్ కు దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: హైదరాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కాంగ్రెస్(Congress) 100 రోజుల పాలనలో 200 మంది రైతులు(Farmers) ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేసీఆర్(KCR) ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను సిఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..
బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అవినీతి, ఎంపీలు పార్టీని వీడటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్.. రద్దైపోయిన 1000 నోటు లాంటి వారని, ఆయన ఎవరితో ఉంటే వారు అరెస్టవుతారన్నారు. బీఆర్ఎస్కు అందిన 1500 కోట్ల ఎన్నికల బాండ్ల నిధుల నుంచి రైతులకు 100 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థుల ప్రకటన..
తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(CM Mallu Bhatti Vikramarka) నేడు మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సైతం హస్తినకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరుకానున్నారు. కాగా, దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రకటించకుండా ఉన్న పార్లమెంట్ స్థానాలపై చర్చించి.. అనంతరం అభ్యర్థుల ఫైర్లను సీఈసీ ఫైనల్ చేయనుంది. తెలంగాణలో సైతం మరో నాలుగు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు.
ఇది చదవండి: అరేబియా సముద్రంలో దొంగల దాడి..!
ఈ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో చర్చించేందుకు తెలంగాణ నుండి రేవంత్, భట్టి, మున్షీ ఢిల్లీకి వెళ్తున్నారు. సీఈసీలో చర్చించిన అనంతరం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లోక్ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
బీఆర్ఎస్(BRS)కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్(Congress)లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ రోజు ఎంపీ కేకే, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసానికి కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ ఫైర్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ..
ఉమ్మడి మహబూబ్ నగర్(Mahabubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(Election Polling) నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఓటు వేశారు. స్వయంగా ఊరు వెళ్లి కొడంగల్ ఎంపీడీవో కార్యాలయం(Kodangal MPDO Office)లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం 1439 మంది ఓటర్ల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు 89 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy)పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ పీఎస్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద రూ.2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని సీరియస్ అయ్యారు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: నేడు కర్నూలులోకి ప్రవేశించనున్న మేము సిద్దం బస్సు యాత్ర..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారెంటీలపై ప్రకటన:
తుక్కుగూడ(Tukkuguda) నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం(Shankharavam) పూరిస్తామని తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయస్థాయి(Congress national level) సభ ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయస్థాయిలో గ్యారెంటీల ప్రకటన ఉంటుందన్నారు.తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారెంటీలపై ప్రకటన చేస్తారని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు.
లోక్ సభ ఎన్నికలు 100 రోజుల పాలనకు రెఫరెండం అన్న రేవంత్ రెడ్డి..
మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందన్నారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) తన పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్‌కు బుల్లెట్ రైలు తీసుకువెళ్తున్న మోదీ వికారాబాద్‌కు కనీసం ఎంఎంటీఎస్ కూడా తీసుకు రాలేదని విమర్శించారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసిన మోదీ.. మూసీ రివర్ ఫ్రంట్‌కు మాత్రం నిధులివ్వలేదన్నారు. అసలు ఏం చూసి మోదీకి ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది చదవండి: హైదరాబాద్ – కరీంనగర్ ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
పంట నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishnarao) అన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి జూపల్లి పరిశీలించారు. బిక్నూర్ మండలం మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండా మండలం లింగుపల్లి గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సర్వే పూర్తికాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థికసాయం చేస్తామన్నారు. 4-5 ఎకరాలున్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం కు సర్వం సిద్ధం..
తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్(Raj Bhavan)లో సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) చేత తెలంగాణ(Telangana) హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్(Raj Bhavan)లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పలువురు మంత్రులు, సీఎస్, అధికారులు హాజరయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాగా, తమిళిసై(Tamilisai) రాజీనామాతో తెలంగాణ(Telangana) ఇంచార్జ్ గవర్నర్‌గా ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ(Telangana) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)నే చూడనున్నారు.
ఇది చదవండి: కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. లోక్ సభ అభ్యర్థుల ఖరారు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి






Total views : 91023