Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ ఫైర్…

కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ ఫైర్…

by Prakash
Vinay Bhaskar


డెబ్భయి అయిదేళ్ల వయసు వచ్చినా కడియం శ్రీహరి (Kadiam Srihari) కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదు – దాస్యం వినయ్ భాస్కర్ (Vinay Bhaskar)

డెబ్భయి అయిదేళ్ల వయసు వచ్చినా కడియం శ్రీహరి (Kadiam Srihari) కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను తప్పించి సీటు ఇచ్చినా విశ్వాసం లేదన్నారు. కడియం శ్రీహరి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకని పబ్బం గడుపుతున్నారన్నారు. ఒక ప్యాకేజీ మాట్లాడుకుని రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్నారు.

కడియం శ్రీహరి ఒక నమ్మక ద్రోహి…

కడియం శ్రీహరి ఒక నమ్మక ద్రోహి అని అన్నారు. కడియం శ్రీహరి వల్ల ఎందరో నేతలు బలి పశువులయ్యారన్నారు. పార్టీ అగ్రనాయకత్వాన్ని నమ్మించి మోసం చేయడం కడియానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి పదవులు పొందారన్నారు. ఇప్పుడు కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం పదేళ్ల నుంచి తనను ఆదరించిన పార్టీని కాదని కాంగ్రెస్ లో చేరుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారంటూ వినయ్ భాస్కర్ కడియంపై ఫైర్ అయ్యారు.

ఇది చదవండి : ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి 


Advertisements

You may also like

Our Visitor

019550
Total views : 91064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.