• జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2023ను రద్దు చేయాలి.
• ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.
• సివిల్ కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేశారు.
• ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే ఆస్కారం ఉంది.
• సివిల్ కేసులు వేగవంతంగా పరిష్కరించాలనుకుంటే కోర్టులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి.
• న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి.
• జగన్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ఇస్తానన్న రూ.100కోట్లలో రూ.75కోట్లు నేటికీ రాలేదు.
• కోర్టుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాలు పూర్తిచేయాలి.
• ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులు వేగంగా పరిష్కరించాలి.
• రూ.20 అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంపును రద్దు చేసి, రూ.100 వెల్ఫేర్ స్టాంపును అమలు చేయాలి.
• న్యాయవాదుల కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
• 41ఏ సీఆర్పీసీ నోటీసుల దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి.
లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు వేసే దుర్మార్గపు సంస్కృతిని తెచ్చాడు.
• న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులతో వేధింపులకు దిగుతున్నారు.
• సామాన్యుడికి న్యాయాన్ని దూరం చేసేలా నల్ల చట్టాలు తెస్తున్నారు.
• న్యాయమూర్తులను సైతం సైకో సోషల్ మీడియా గ్రూపుల్లో కించపరుస్తున్నారు.
• మేం అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు రక్షణ చట్టం తెస్తాం.
• ల్యాండ్ లైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం.
• న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచుతాం.
• నిలిచిపోయిన కోర్టు భవనాల పనులు పూర్తిచేస్తాం.
• సత్వర న్యాయం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమల్లోకి తెస్తాం.
cvr news
కడప జిల్లా… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీ పై అక్టోబర్ 28 వ తేదీనా జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను మూడవ పట్టణ ఇన్స్పెక్టర్, సిబ్బంది అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డిఎస్పి నాగరాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. బెనర్జీ పలుమార్లు ముద్దాయిలను బెదిరించినట్లు, పథకం ప్రకారం సాధికార సామాజిక బస్సుయాత్ర లో అదును చూసుకుని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ రోడ్డుపై బెనర్జీని ముద్దాయిలైన రామ్మోహన్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డిలు అతని బైకును ఢీ కొట్టి, అందుబాటులో ఉన్న కొడవలితో దాడి చేయడంతో పాటు హత్యా ప్రయత్నం చేసి.. అనంతరం బైకుపై పరారయ్యారని వెల్లడించారు. శనివారం ఉదయం వీరి అరెస్టును ధ్రువీకరించిన డిఎస్పి, భరత్ కుమార్ రెడ్డి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు రెండు సిమ్ కార్డులు, రామ్మోహన్ రెడ్డి వద్ద నుండి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు నిందితులు సెల్ఫోన్లు సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. రాయచోటికి చెందిన సిద్ధారెడ్డి అనే వ్యక్తి అలాగే మరికొందరు ముద్దాయిలకు సహకరించి వారికి వాహనాలు, ఆర్థిక సాయం చేసినట్లు తమ విచారణలో తేలిందని, త్వరలో వారిని కూడా విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ అలాగే సిబ్బందిని డిఎస్పీ నాగరాజు అభినందించారు. అలాగే ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా జి వి ఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉలవపాడు నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జిలానీ బాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారపాటి గోపీ చంద్ ప్రకాష్, కామర్స్ అధ్యాపకులు జ్యోతి, కెమిస్ట్రీ అధ్యాపకులు సుభాషిణి, బోటనీ అధ్యాపకులు గంగా భవాని, హిందీ అధ్యాపకులు రఫీ, ఫిజిక్స్ అధ్యాపకులు చల్లా శ్రీనివాసులు, జువాలాజి అధ్యాపకులు వెంకటేశ్వర్లు, తెలుగు అధ్యాపకులు మాధవరెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బాచారి, మ్యాథ్స్ అధ్యాపకులు మల్లికార్జున మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా జి వి ఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉలవపాడు నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జిలానీ బాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారపాటి గోపీ చంద్ ప్రకాష్, కామర్స్ అధ్యాపకులు జ్యోతి, కెమిస్ట్రీ అధ్యాపకులు సుభాషిణి, బోటనీ అధ్యాపకులు గంగా భవాని, హిందీ అధ్యాపకులు రఫీ, ఫిజిక్స్ అధ్యాపకులు చల్లా శ్రీనివాసులు, జువాలాజి అధ్యాపకులు వెంకటేశ్వర్లు, తెలుగు అధ్యాపకులు మాధవరెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బాచారి, మ్యాథ్స్ అధ్యాపకులు మల్లికార్జున మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
సోమవారం భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ గుంటలో ప్రమాదవశాత్తు పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ సన్నాఫ్ ఖాదర్ బాషా శవం శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో పోస్ట్ మార్టం జరిగింది. ఈ పోస్ట్ మార్టం సందర్భంగా కందుకూరు సిఐ. నఫీజ్ భాష ఉలవపాడు ఎస్ఐ బాజీ రెడ్డి, ఎంపీడీవో చెంచమ్మ, ఎమ్మార్వో బ్రహ్మయ్య, వీఆర్వోలు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఆ బాలుడు చనిపోక ముందే సెప్టిక్ ట్యాంకి పైన ముల్లకంప వేసి ఉంటే ఈరోజు సాకేత్ మరణించేవాడు కాదు అందువల్ల సాకేత్ మరణం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అర్థం అవుతుంది. మరణానికి కారుకులైన అధికారులు పైన, సాకేత్ మరణానికి కారుకులైన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఒక దళిత బాలుడు ప్రాణాలు కోల్పోయాడని బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఒక అధికారి కూడా సందర్శించి సానుభూతి తెలియజేయలేదని అంత అమానవీయంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని అదే సందర్భంలో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాలకి నిద్ర పట్టకుండా ఓట్ల వేట్ల కొనసాగించే అధికార ప్రతిపక్ష నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదని ఆర్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ రికార్డులు మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు. సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, ఉత్తమ్, పొంగులేటి ఉన్నారు.
Read Also..
Read Also..
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గ్రామానికి చెందిన శాఖ నాగ దుర్గ ప్రసాద్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే అధికార పార్టీకి చెందిన యువకుడు, టేకులబోరు గ్రామంలోని ఓ కిరాణా షాపుకు వచ్చిన నాగ దుర్గ ప్రసాద్ కు అక్కడే షాపు వద్ద ఉన్న బత్తుల వెంకటేష్ అనే యువకుడికి మధ్య మాట మాట రావడంతో వెంకటేష్ అనే యువకుడు షాపులో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకొని దుర్గ ప్రసాద్ పై పోసి వెంటనే నిప్పు అంటించడంతో పక్కనే షాపులో ఉన్న మరో వ్యక్తి మంటలు ఆర్పీ బాడుతుడను ఆసుపత్రికి తరలించారు, బాధితుడు సోదరి మాధివి జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని అవతలి వ్యక్తి అధికార పార్టీ యువకుడు కావడంతో కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించింది, కేసు గత నెల 18 వ తేదీన ఘటన జరిగితే 21 వ తేదీ వరకు FIR నమోదు చేయలేదని బాధితుడి అక్క ఆరోపించింది పైగా అతనిపై ఏదో సెక్షన్ మీద కేసు నమోదు చేసి వాళ్ళతో రాజీపడమని పోలీసులు పదే పదే చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు, విషయం ఆలస్యంగా బయటకు రావడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు యడవల్లి భాస్కర్, బరపారి ప్రకాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులతో సమావేశం అయ్యారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ముప్పు దృశ్య జిల్లా అధికారులు ఎవరూ సెలవు పెట్టరాదని, నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. వాతావరణం మార్పుతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు అధికారులు వెనకకు రప్పించారు. సముద్ర ప్రాంతములో తీవ్రమైన గాలులు వీచడంతో పడవలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీస్తున్నాయని, అలలు ఉవ్వెత్తిన ఎగసిపడుతున్నాయని ప్రతి సంవత్సరం నవంబర్ వచ్చిందంటే తుఫాన్లు తప్పడం లేదని దీంతో నష్టపోవడం జరుగుతుందని గంగపుత్రులు వాపోతున్నారు. మత్యకారులును సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ నిషేధాజ్ఞలు అధికారులు జారీ చేశారు.
తెలంగాణ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు కూడా రానున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి.. ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు సర్వేలు కూడా తెలంగాణలో ప్రముఖ పార్టీ గెలువనుందని తెలిపాయి. అయితే కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు. ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి’’ అంటూ రాసుకొచ్చారు.
తెలుగు ప్రజలు సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేలా, వారికి సేవ చేసే అవకాశం ఇమ్మని అమ్మవారిని వేడుకున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దుర్గమ్మ గుడికి భార్యతో కలిసి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన ప్రయనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు. దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. తనకు అన్యాయం జరిగినప్పుడు దేశవిదేశాల్లోని తెలుగు వారంతా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటాలు చేశారన్నారు. కాగా, చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలకకగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు, ఫొటో అందజేశారు. చంద్రబాబుకు కేశినేని నాని, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేశ్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది. హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవల విభాగంలో నర్సులు డాక్టర్ కు ఫోన్ చేసి, డాక్టర్ చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్సులు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి రావడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.