ఈరోజు అనగా 4-11-23 వ తేదీ శనివారం మరియు రేపు అనగా 5-11-23 వ తేదీ ఆదివారం రెండు రోజులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు చేర్పులు మార్పులు తొలగింపులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ కోరారు.
elections
రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు. రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని రాజేంద్రనగర్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించడమే కాకుండా గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసి పేద ప్రజలకు మెరుగైన వనరులతో పాటు విద్యావంతులని ప్రోత్సహించడంలో ఎంతగానో పాటు పడతానని అలాగే ఆయనకు బిజెపి అధిష్టానం నమ్మి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో పులి మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం నుంచి పదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్య హ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ను స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 18 వేల 212 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల సందర్భంగా ప్రలోభాలను, అక్రమాలను అరికట్టడానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ బృందాలు, ఒక వీడియో సర్వైలెన్స్ బృందం, ఒక అసిస్టెంట్ ఎక్సెండిచర్ అబ్జర్వర్ బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో అభద్రతా భావం తొలగించడంతో పాటు వారికి బరోసా కల్పించడం కోసమే ఖవాత్ అని ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ తెలిపారు… ఈస్ట్ జోన్ పరిధిలోని చిలకల గూడ, వారాసి గూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కవాత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సునీల్ దత్ పాల్గొని వారితో కలసి కవాత్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సునీల్ దత్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరపడం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సంఘ విద్రోహ శక్తులు పట్ల కటినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రౌడీ షీటర్లు అందరినీ బైండ్ ఓవర్ చేశామని ఓటర్లను భయపెట్టడం కానీ, బెదిరింపులకు పాల్పడడం కానీ చేస్తే నిసంకొచంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలంతా ఎన్నికలలో పాల్గొని తనయొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులకు మూడోసారి భంగపాటు తప్పదని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో గడప గడపకు వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు ఎలా వేస్తారన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడం ఖాయమని, పెద్దపల్లి నియోజవర్గంలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను కేసీఆర్ అందిస్తున్న అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అండగా నిలవాలని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్వేర్ తమ వద్ద లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న వారిని ఓటు వేయకుండా అడ్డుకోలేమన్న విషయం స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరి 1 నాటికి పూర్తి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటి వరకు ఆ పనిచేయని వారు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లేదంటే జులై 1 లేదా, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండితే కనుక అలాంటి వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే, 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఈసీ వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల మూడు లక్షల ఎనభై ఐదు వేలమందికి పైగా ఉన్నారు. 2కోట్ల3 లక్షల85 వేల 851 పురుష ఓటర్ల సంఖ్య ఒక కోటీ తొంభై ఎనిమిది లక్షల ముప్పయి ఒక్క వేలకు పైగా ఉన్నారు. సర్వీసు ఓటర్లు 68 వేల 158 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది.
డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిలకు ఉందా? అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు. ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. ఆశయాలకు అనుగుణంగా నీతిగా నిజాయితీగా విధానాల ప్రాతిపదికన ప్రజలను చైతన్యం చేసి ఓట్లు అభ్యర్థించే ఏకైక పార్టీ ఎంసిపిఐ(యు) అని అన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు గుమ్మరించి మద్యం మత్తులో ఓట్లు దండుకొని రాజకీయాలను వ్యాపారంగా మార్చిన రాజకీయ పార్టీలను గుర్తించాలని కోరారు. నీతివంతమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్ధుడైన బహుజన బిడ్డగా నన్ను ఆదరించాలని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్ల మార్క్ దాటింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అక్టోబరు 9న నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.307.2కోట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గడచిన 24గంటల్లో రూ.9.69కోట్ల నగదు పట్టుబడగా, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.105.58 కోట్లు అని వెల్లడించారు. రూ.1.35లక్షల విలువైన మద్యం పట్టుబడిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సరకు విలువ రూ.13.58 కోట్లు అని తెలిపారు. 24 గంటల్లో రూ.72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. గడచిన 24గంటల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారెట్ల వజ్రాలు, 5గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.145.67 కోట్లు. వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయని తెలిపారు.






Total views : 141246