కిడ్నీ స్టోన్స్‌తో చాలా మంది బాధపడతారు. కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి ఉంటుంది. దీనిని భరించడం చాలా కష్టం. రాళ్ళ పరిమాణాన్ని బట్టి నొప్పి, ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మీరు మందులు తీసుకుని పుష్కలంగా నీరు తాగితే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది. ముల్లంగి జ్యూస్ అనేది కిడ్నీల్లో రాళ్ళని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని కోసం రోజూ అరగ్లాసు ముల్లంగి జ్యూస్ తాగాలి. దీనిని నేరుగా తీసుకోవడం కంటే జ్యూస్ చేసి తాగడం వల్ల రాళ్ళు కరిగిపోతాయి. హార్స్‌గ్రామ్ అని పిలచే ఈ గింజల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్, ప్రోటీన్, ఐరన్, బి కాంప్లెక్స్, కాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్ళ ట్రీట్మెంట్లో ఇవి బాగా పనిచేస్తాయి. కాబట్టి, వీటిని తీసుకోవాలి. మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ దూరమవుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌లు కిడ్నీలు సరిగ్గా పనిచేసి కిడ్నీల్లో రాళ్ళని దూరం చేస్తాయి. కాబట్టి, రెగ్యులర్‌గా మజ్జిగ తీసుకోవడం మంచిది. బార్లీ కూడా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది. ఇది మూత్ర విసర్జనగా పనిచేస్తుంది.మూత్ర విసర్జనని పెంచుతుంది. దీని వల్ల బాడీ నుండి ట్యాక్సిన్స్ బయటకి వెళ్తాయి. కిడ్నీ స్టోన్స్, సిస్ట్‌లకు బార్లీ వాటర్ చాలా మంచిది. బార్లీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.Read Also..
Kidney stones
చూడగానే ఎర్రగా నోరూరించే పండు దానిమ్మ. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. కేలరీలు 234, ప్రోటీన్ 4.7గ్రా, కొవ్వు 3.3 గ్రా, కార్బోహైడ్రేట్స్ 52 గ్రా, ఫైబర్ 11.3 గ్రా వీటితో పాటు విటమిన్ సి, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియంలు ఉన్నాయి. దానిమ్మ పండ్లని ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి. దానిమ్మ రసం తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పండు తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని దూరం చేస్తాయి. దానిమ్మలో ఎల్లాజిటానిన్స్ అనే యాక్సిడెంట్స్ శరీరంలోని వాపుని తగ్గిస్తాయి. దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యని తగ్గిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యని దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. దానిమ్మ రసం రక్తంలో ఆక్సలేట్స్, కాల్షియం సాంద్రతని తగ్గిస్తుంది. దానిమ్మలో పాలీఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మలో దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. దానిమ్మతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ సమస్యలు దూరమవుతాయి. దానిమ్మ తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మీరు అధిక వేడితో అలసిపోయినా మీ శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా చెరకు రసం మీకు ఉపయోగపడుతుంది. కాలేయానికి మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు. ఎందుకంటే చెరుకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. నోటిలో కావిటీస్, నోటి దుర్వాసన నివారణకు చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. దాని ద్వారా వాటికి పురుగులు, దంతాలలో పుచ్చులు ఉండవు. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది. చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. అంతే కాకుండా చెరుకు రసం మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది. చెరుకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగు చేయడం సహా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
Read Also..
Read Also..
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్నా కూడా బరువు పెరిగిపోరు. బొప్పాయిని తీసుకోవడం వల్ల మరో ముఖ్యమైన లాభం ఉంది. అదేమిటంటే గుండెకు రక్తం సరఫరా అయ్యేటట్టు బొప్పాయి చూసుకుంటుంది. అలానే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే వారికి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా బొప్పాయితో కరుగుతాయి. అలానే అలసట నీరసం ఉన్న వాళ్ళకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని అభివృద్ధి చేసి బలాన్నిస్తుంది. క్యాన్సర్ తో కూడా పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. కోలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి కూడా తగ్గుతాయి. అంతే కాదు పళ్ళు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. నారింజ, ఆపిల్‌లో కంటే బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ ని మృదువుగా సున్నితంగా కోమలంగా మారుస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం బొప్పాయిని తినకూడదు చూసుకోండి.
ఈ నీరు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, అధిక క్రియాటినిన్ స్థాయిలు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. వీటితో ఇంకేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. అధిక బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. రక్తంలో చక్కెరను స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. బార్లీ వాటర్ తాగుతుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా వుండేందుకు బార్లీ వాటర్ మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన గర్భాన్ని నిర్ధారించడంలో బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది.





Total views : 140944