ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమం జనప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సమస్యలు, విశిష్ట వ్యక్తులు, సందర్భాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ జనాల్లోకి తీసుకెళుతున్నారు. మన్‌కీ బాత్ తరహాలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక కార్యక్రమం ద్వారా నేరుగా ఏపీ ప్రజలతో ముఖాముఖీ మాట్లాడబోతున్నారు. ఆడియో, వీడియో రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో డయల్ యువర్ సీఎం ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించారు. ఆ కార్యక్రమం, మన్ కీ బాత్ కలయిక ద్వారా ఒక నూతన కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు భావిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
- అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్‌సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన…
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి