ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం(TDP office) వద్ద డ్రోన్(Drone) కలకలం సృష్టించింది. నవీన్ అనే యువకుడు వైసీపీ బ్యాండెడ్ చేతికి పెట్టుకుని మినీ డ్రోన్ కెమెరా ఎగరవేస్తూ హల్ చల్ చేసాడు. ఆ డ్రోన్ తో టీడీపీ కార్యాలయాన్ని షూట్ చేసి, ఆ తరువాత కార్యాలయం లోపలకు పంపే క్రమంలో డ్రోన్ కింద పడిపోయింది.
అప్రమత్తమయిన టీడీపీ నాయకులు నవీన్ ను పట్టుకుని పోలీస్ లకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు తన ప్రచారాన్ని ముగించుకుని యర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులతో మాట్లాడి..అనుచరులతో కలసి శనివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు.
ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ తో మాట్లాడుతూ వైసీపీ కి చెందిన వారు ఉద్దేశ పూర్వకంగానే డ్రోన్ కెమెరా ను టిడిపి కార్యాలయం లోకి పంపే ప్రయత్నం చేశారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో టీడీపీ నాయకులు తమ నాయకుడు ఎరిక్షన్ బాబు కు హాని చేయాలనే ఉద్దేశంతో నే వైసీపీ కి చెందిన వారు పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం కు చెందిన నవీన్ తో రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. దీని వెనుక ఉన్న అసలైన సూత్ర దారులను గుర్తించాలని సిఐ కు తెలిపారు.
డ్రోన్ ఎగుర వేసిన నవీన్ పై పోలీస్ లు కేసు నమోదు చేసారు. అర్ధరాత్రి ఎరిక్షన్ బాబు అనుచరులతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళటంతో రాజకీయ వేడిని రాజేసినట్లయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 141590