మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఫోన్ ను ఎప్పుడూ ముఖానికి దగ్గరగా ఉంచుకోకూడదు. దీనివల్ల ఫోన్ నుంచి బ్యాక్టీరియా ముఖానికి వ్యాపిస్తుంది. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. అలాగే ఫోన్ ఎప్పుడూ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడుస్తుండాలి. 70 శాతం ఆల్కహాల్ ఉండే వైప్స్ తో ఫోన్ ను తుడవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. చాలా మంది బాత్ రూమ్స్ లోకి కూడా తీసుకువెళ్లి ఉపయోగిస్తుంటారు. దీని వల్ల బ్యాక్టీరియా మరింత ఎక్కువగా చేరుతుంది. బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లకుండా ఉంటేనే ఉత్తమమని సూచిస్తున్నారు. తల, భుజాన్ని గంటల తరబడి వంచి మొబైల్ ను చూడటంవల్ల టెక్స్ట్ నెక్ అనే సమస్య బారిన పడతారు. వెన్ను పైభాగం, భుజాలలో తీవ్రమైన నొప్పితో బాధ పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
scars
గంజాయి నుంచీ తీసిన నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. నిజానికి గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని తీస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె అనేది ఒకటి మాత్రమే. ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా అంటారు. CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విపరీతమైన నొప్పి, టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్, టెన్షన్, ఒత్తిడి, కంగారు, బిజీ లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. ఈ ఆతృత అనేది సర్వ రోగాలకూ పరోక్ష కారణమవుతోంది. గంజాయి నూనెతో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో కూల్‌గా, హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా CBD ఆయిల్లో ఉన్నాయి. సాధారణంగా కాన్సర్ ఉన్నవారికి వికారంగా, వామ్టింగ్ అయ్యేలా ఉంటుంది. మన చర్మంపై మచ్చలు, మొటిమల వంటివి కామన్. అవి జన్యుపరమైన కారణాల వల్ల, బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. వాటి నుంచీ తప్పించుకోవాలంటే గంజాయి నూనె వాడాలంటున్నారు పరిశోధకులు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు. మొటిమలు, మచ్చల అంతు చూస్తాయి. మతిమరపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ నూనె బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఆల్రెడీ ఈ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ నూనె మంచి ఫలితాలు చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది. హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది. హైబీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బీపీ పెరగకుండా జాగ్రత్త పడాలి. అందుకు ఇలాంటి ఆయిల్స్ రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ ఉంటే బీపీ ఆటోమేటిక్‌గా కంట్రోల్లో ఉంటుంది.
ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం. పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కామెర్ల వచ్చిన వారికి, లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది. ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది. కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.
Read Also..
Read Also..
చందనం ఒక శక్తివంతమైన మూలిక, చందనం ఒక గొప్ప చర్మ సంరక్షణ మూలిక. ఇది చర్మాన్ని మృదువుగా మరియు మెరుస్తూ చేయడంలో సహాయపడుతుంది, మరియు ఇది మొటిమలు, మచ్చలు మరియు వృద్ధాప్య ఛాయలను నివారించడంలో సహాయపడుతుంది. చందనం నూనెను నేరుగా చర్మానికి లేదా టోనర్ లేదా లోషన్లో కలుపుకొని ఉపయోగించవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ చందనం ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది చర్మపు రుద్దులు, గాయాలు మరియు దద్దుర్లు వంటి పరిస్థితులను చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ప్రశాంతపరచడంలో మరియు దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ చందనం ఒక శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్, ఇది చర్మంపై బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు మరియు ఇతర చర్మ సంక్రమణలను నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్ చందనం ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మ కణాలను నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు, మచ్చలు మరియు వృద్ధాప్య ఛాయలను నివారించడంలో సహాయపడుతుంది. సాంప్రదాయ వైద్యం చందనం సాంప్రదాయ వైద్యంలో అనేక రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతుంది. ఇది జలుబు, జ్వరం, అలసట మరియు ఆందోళన వంటి పరిస్థితులను చికిత్స చేయడంలో సహాయపడుతుంది. చందనం ఒక సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మూలిక, ఇది అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మీ చర్మం లేదా ఆరోగ్యం కోసం చందనం ఉపయోగించడానికి ఆసక్తి ఉన్నట్లయితే, మీరు ముందుగానే వైద్యుడిని సంప్రదించాలి.




Total views : 141507