దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి విపరీతంగా పెరిగింది. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Snow Smoke
ఉత్తరాదిన మంచు ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు గంటల తరబడి స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారింది మొదలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పొగమంచు తో కమ్ముకుంటున్నాయి. దీంతో రాకపోకలు సన్నగిల్లుతున్నాయి.
న్యూఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రాలైన హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్ 10 నుండి 26 గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం.. జి ఎస్ ఎల్ వద్ద నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళుతున్న కర్రల లారీ, లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో పొగమంచు ఉండడంతో అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. జాతీయ రహదారిపై కర్రలు అడ్డంగా పడిపోవడంతో.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను వన్ వే దారి మళ్లించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Read Also..
నల్గొండ జిల్లా.. నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద NH 186 పై ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి చెందారు. పోగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ (19) ని బైక్ తో ఢీ కొట్టిన నాగరాజు (28) ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. రమావత్ కేశవులును చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల టాటా ఏస్ ను పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కొట్టింది. టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురులో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరోనలుగురి పరిస్థితి విషమం. మృతులు రమావత్ కేశవులు(19), రమావత్ గణ్య(40), నాగరాజు(28), రమావత్ పాండు (40), రమావత్ బుజ్జి(38) మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందినవారు. మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also..