తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి – శ్రీధర్ బాబు, హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్, మెదక్ -కొండా సురేఖ, ఆదిలాబాద్ – సీతక్క, నల్లగొండ – తుమ్మల నాగేశ్వర్ రావు, మహబూబ్‌నగర్ – దామోదర్ రాజనర్సింహ, నిజామాబాద్ – జూపల్లి కృష్ణారావులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నియమించబడ్డ మంత్రులు ఆయా జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల పంపిణీని పర్యవేక్షించనున్నారని ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా, సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఏ జిల్లా మంత్రికి కూడా సొంత జిల్లా బాధ్యతలను అప్పగించలేదు. దీని ద్వారా సంక్షేమ పథకాల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా. కేవలం లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
telangana new cm revanth reddy
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం అవుతుంది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది. నిజానికి గత రాత్రే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
సీఎల్పీ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపి.. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌కు తెలియజేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను నేడు గవర్నర్‌కు ఈసీ అందిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.





Total views : 149709