చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కసారి పొగతాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగతాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు, ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గించగలవనే విషయాన్ని గుర్తించుకోవాలి. యాపిల్స్ లో చాలా పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనామ్లజనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడగలవు. మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు. మీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలోయాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడగలదు. దానిమ్మలోనూ యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. దానిమ్మను పండు తిన్నా దాంతో జ్యూస్ చేసుకుని తాగినా చాలా ప్రయోజనాలుంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, సీ, కే, బీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది. అలాగే కాలీఫ్లవర్, కాలే, టర్నిప్, క్యాబేజీ వంటి కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తరుచుగా తింటూ ఉంటే మీ ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా ఉండదు. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడగలదు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించగలదు. నికోటిన్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి. అందువల్ల తరుచుగా గ్రీన్ టీ తాగుతూ ఉండండి.
Vitamin A
విటమిన్ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం – 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌందర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు.
Read Also..
Read Also..
గుమ్మడి అనేది ఒక రుచికరమైన మరియు పోషకమైన కూరగాయ. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో సాధారణంగా పండిస్తారు. గుమ్మడిని ఆయుర్వేదంలో కూడా ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. గుమ్మడిలో విటమిన్ సి, విటమిన్ ఏ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడిలో విటమిన్ సి, విటమిన్ ఈ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుమ్మడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. గుమ్మడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.
Read Also..
Read Also..
ఈ కాలంలో పొన్నగంటి కూర ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ఫొలేట్, ‘రైబోఫ్లెవిన్’, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి. అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.





Total views : 141274