ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ.
ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు , బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.