పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. నర్సాపురం నుంచి చర్లపల్లి మధ్య ప్రతి ఆదివారం నడిచే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సేవలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు.నర్సాపురం రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.అదేవిధంగా.. భవిష్యత్తులో నర్సాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
Tag:




Total views : 56592