Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

by Satya
Governor approval

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, సభ్యుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్‌లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు.

Advertisements

You may also like

Our Visitor

013953
Total views : 78667

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.