Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Crime రేణిగుంట బుగ్గవీధిలో రైల్వే టెక్నీషియన్ కిల్లి రవి ఆత్మహత్య.

రేణిగుంట బుగ్గవీధిలో రైల్వే టెక్నీషియన్ కిల్లి రవి ఆత్మహత్య.

by CVR NEWS
రేణిగుంట బుగ్గవీధిలో రైల్వే టెక్నీషియన్ కిల్లి రవి ఆత్మహత్య

రేణిగుంట బుగ్గవీధి ప్రాంతంలో రైల్వే శాఖ టెక్నీషియన్ కిల్లి రవి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో పాటు ఓ మహిళతో వివాదం కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సోదరుడికి వాట్సాప్ సందేశం పంపిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: