Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు.

తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు.

by CVR NEWS
తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకాన్ని పోస్ట్ చేశారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని వెల్లడించారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23న హైదరాబాద్‌లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ పక్కన ఉన్న రోడ్డుకు డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూగా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆవిష్కరించారు. కీలక అమెరికా టెక్‌ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌లు ఈ రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణ, అమెరికా మధ్య వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: