Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ బాధితులకు అండగా ఎంపీ డీకే అరుణ.

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ బాధితులకు అండగా ఎంపీ డీకే అరుణ.

by CVR NEWS

మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ డీకే అరుణ. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఢిల్లీలో కలిసి, సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 641 ద్వారా సిద్ధాపూర్ గ్రామంలోని 86 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసి, అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిందని ఎంపీ డీకే అరుణ కేంద్ర మంత్రికి వివరించారు. అయితే, ఇదే ప్రాంతాన్ని గతంలో ఈకో టౌన్ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించారని గుర్తు చేశారు. జీవో-111 పరిధిలోని దాదాపు 50 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ప్రభావం పడే అవకాశం ఉందని, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి వనరులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యం, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: